Surat Building Collapse : గుజరాత్‌లోని సూరత్ నగరంలోని సచిన్ పాల్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఐదు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మరణించారు. చాలా మంది ఇప్పటికీ శిథిలాల కింద ఉన్నారని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనా స్థలంలో నిన్న మధ్యాహ్నం నుంచి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నాయి. 12 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సూరత్ డీసీపీ రాజేష్ పర్మార్ తెలిపారు. ఒక మహిళను రక్షించారు. ఇప్పటి వరకు ఏడు మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
సూరత్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కంట్రోల్ రూమ్‌కు శనివారం మధ్యాహ్నం 3.55 గంటలకు ఐదు అంతస్తుల భవనం కుప్పకూలినట్లు కాల్ వచ్చిందని సూరత్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పరీక్ ఆదివారం ఉదయం తెలిపారు. కార్పొరేషన్‌లోని అన్ని బృందాల ఉద్యోగులతో పాటు దాదాపు 80 మంది ఫైర్మెన్లు, 20 మంది అగ్నిమాపక అధికారులు వెంటనే ఇక్కడికి చేరుకున్నారు. రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిందని బసంత్ పరీక్ తెలిపారు. ఇప్పటి వరకు ఏడు మృతదేహాలను వెలికి తీయగా, ఎవరూ ప్రాణాలతో కనిపించలేదు. ఇప్పుడు లోపల ఎక్కువ మంది చిక్కుకునే అవకాశం లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా, శిధిలాలను తొలగించి ట్రక్కులోకి ఎక్కిస్తున్నారు అధికారులు.
కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఏడు మృతదేహాలను బయటకు తీయగా, ఒకరిని కూడా సజీవంగా రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఇంకా ఎంత మంది చిక్కుకుపోయారో చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. ఈ భవనం సుమారు 7 సంవత్సరాల క్రితం నిర్మించినది అని చెబుతున్నారు. ఈ సంఘటన సూరత్ నగరంలో శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు జరిగింది.