»Andhra Pradesh First Cabinet Meeting Discussion On The Implementation Of Super 6 Schemes
Andhra Pradesh: తొలి క్యాబినెట్ భేటీ.. సూపర్ 6 పథకాల అమలుపై చర్చ!
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఏర్పడింది. అయితే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో ఈరోజు జరుగుతుంది. ఈ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
Andhra Pradesh: First cabinet meeting.. Discussion on the implementation of Super 6 schemes!
Andhra Pradesh: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఏర్పడింది. అయితే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో ఈరోజు జరుగుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛను పెంపు, అన్న క్యాంటీన్లు, నైపుణ్య గణనపై సంతకాలు చేశారు. అయితే వీటికి ఈ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
అలాగే సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన చర్చించనున్నట్లు సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు, రాజధాని ప్రాంతంలో పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా చర్చించనున్నట్లు తెలిసింది. జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.