సంక్రాంతికి తెలుగులో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ మధ్య ఎలాంటి పోటీ ఉందో.. తమిళ్లో అంతకు మించిన బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. అజిత్, విజయ్.. ఈ ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అయితే.. ఫ్యాన్ వార్ పీక్స్‌లో ఉంటుంది. ఈ పొంగల్ బరిలో అజిత్ ‘తునివు’, విజయ్ ‘వారిసు’ నువ్వా నేనా అంటున్నాయి. తెలుగులోను ఈ సినిమాలపై కాస్త బజ్ ఉంది. ‘వారిసు’ సినిమా ‘వారసుడు’ పేరుతో దిల్ రాజు నిర్మాణంలో గ్రాండ్‌గా రాబోతోంది. అయితే ‘తునివు’ సినిమాకు ఇంకా తెలుగు టైటిల్ ఫిక్స్ చేయలేదు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. దాంతో అజిత్ ఫ్యాన్స్ రిలీజ్ డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక తెలుగు అభిమానులకు ‘తునివు’ డబ్బింగ్ టైటిల్ పైనే దృష్టి ఉంది. ఎందుకంటే.. గతంలో అజిత్ నటించిన ‘వలిమై’ సినిమాను.. అదే టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేశారు. దాంతో తెలుగులో టైటిలే దొరకలేదా.. అంటూ అరవ టైటిల్ పై మండి పడ్డారు. అందుకే తునివు తెలుగు టైటిల్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది. తెలుగులో ఈ సినిమాను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్, ఐవీవై ప్రొడక్షన్స్ కలిసి రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. దాంతో ‘తెగింపు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 9న ‘తునివు’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి త్వరలోనే తెలుగు టైటిల్‌ను అనౌన్స్ చేయనున్నారని చెప్పొచ్చు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అజిత్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి అజిత్ ‘తెగింపు’ ఎలా ఉంటుందో చూడాలి.