SRPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో జన సమితి కార్యకర్తలు పోటీ చేసినందుకు సిద్ధంగా ఉండాలని జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అన్నారు. ఆదివారం చివ్వెంల మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అవినీతి డబ్బులతో కలుషితమైన రాజకీయ ప్రక్షాళన చేయుట కొరకే జన సమితి పార్టీని స్థాపించినట్లు తెలిపారు.