MHBD: సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి భారీగా డబ్బులు పోగొట్టుకున్న ఘటన నర్సింహుళపేటలో జరిగింది. పడమటిగూడెం గ్రామానికి చెందిన అక్కిరెడ్డి వేణుకి టెలిగ్రాంలో ఓ లింక్ వచ్చింది. వేణు ఈ లింక్ ఓపెన్ చేయడంతో రూ.7లక్షల 69వేల 360లు మాయమయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.