మహబూబ్ నగర్: ఫార్మా కంపెనీలు వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలితే.. తగలబెడుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో రైతాంగం ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో రైతుల పొలాల్లోకి ఫార్మా కంపెనీలు వ్యర్థాలను వదిలితే.. ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు.