కరీంనగర్: గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన చింతలతదేపు మహేష్ (29) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి తనకు ఇష్టంలేని పెళ్లి చేసిందని మనోవేదనకు గురై ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు.