MBNR: పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం.. మోతీ ఘనపూర్ గ్రామానికి చెందిన కరీం కుటుంబ సభ్యులతో గొడవపడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏం జరిగిందో తెలియదు కానీ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.