WGL: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నేటి నుంచి ప్రారంభమవుతోంది. బుధవారం నుంచి జరిగే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో జిల్లా ప్రజలందరూ పాల్గొని సరైన సమాచారం అందించి సహకరించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. మంగళవారం తెలిపారు. ప్రజలందరూ భాగస్వామ్యులై ఖచ్చితమైన సమాచారం అందించాల్సిందిగా కలెక్టర్ కోరారు.