NGKL: అమ్రాబాద్ మండలం మన్ననూరు శ్రీశైలం రహదారి దారవాగు అటవీ ప్రాంతంలో ఈ నెల 14 న అదృశ్యమైన దేవరకొండ మండలం వర్త్య తండాకు చెందిన యాదయ్య శనివారం 11 గంటల సమయంలో వంగూరు మండలం లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతణ్ని వంగూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. యాదయ్య ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.