SRD: దళితుల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ అన్నారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవనం సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలను రీ షెడ్యూల్ చేయాలని చెప్పారు.