father killed : తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి(father) తన ముగ్గురు పిల్లల్ని చంపేసి, తాను కూడా చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. ఈ ఘటనతో శంకర్పల్లి మండలంలో అంతా షాక్కు గురయ్యారు. అసలు ఇతడు ఎందుకు ఈ పని చేశాడు అనే వివరాలను పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టంగుటూరుకు చెందిన రవి (35) అనే వ్యక్తి ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజల నుంచి స్కీమ్ పేరుతో డబ్బులు తీసుకున్నాడు. రూ. వెయ్యి ఇస్తే 58 రోజుల్లో 3000 ఇస్తానంటూ నమ్మబలికాడు. రూ.లక్ష ఇస్తే యాభై ఎనిమిది రోజుల్లో ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తానంటూ అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు.
డబ్బులు ఇచ్చిన వ్యక్తులు వచ్చి తమ డబ్బుల్ని వెనక్కి ఇవ్వాలంటూ అడగడం మొదలు పెట్టారు. ఒకొక్కరుగా ఇంటికి వచ్చి రవిని అడగుతుండటంతో అతడికి ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో అతడు తన ముగ్గురు పిల్లల్ని(3 children) తొలుత చంపేశాడు. తర్వాత తానూ ఉరి వేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.