MDK: పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాణ కోటికి జీవనాధారమైన ఆక్సిజన్ మొక్కల ద్వారానే వస్తుందన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్, పోలీసు సిబ్బంది తదితరులు.