BDK: లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లతండా గ్రామ పంచాయతీకి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు శనివారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమక్షంలో సీపీఐలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.