శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఈ రికార్డు సాధించిన చారిత్రాత్మక సమయంలో అంతరిక్ష శాఖతో అనుబంధం కలిగి ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇస్రో మరోసారి GSLV-F15/NVS-02 మిషన్ను విజయవంతంగా ప్రయోగించి భారత్ గర్వపడేలా చేసిందని ప్రశంసించారు.