MBNR: నియోజకవర్గంలోని గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట మండలం శేర్ణపల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని చెప్పారు. అలాగే త్వరలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు.