NLG: ఎమ్మెల్యే మందుల సామేలు ఆదివారం తిరుమలగిరి సాగర్ మున్సిపల్ కేంద్రానికి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ సకాలంలో విచ్చేసి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.