NRML: సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం సాయంత్రం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలును అత్యంత పగడ్బందీగా నిర్వహించాలని, కొనుగోలు కేంద్రంలో రైతులకు త్రాగునీరు, టెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు.