KMR: బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్లో గాలిపూర్ వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి దేవారం శ్రీనివాస్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తప్పనిసరిగా ఉంటుందని అన్నారు.