SRD: జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో ప్రాజెక్టు ఒక గేట్ ఓపెన్ చేసి మంజీరా నదికి వదిలామని సంబంధిత అధికారి మహిపాల్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 12,082 క్యూసెక్కుల వరద వస్తుందన్నారు. జెన్-కో విద్యుత్ ఉత్పత్తికి 2433 క్యూసెక్కులు, 14వ నంబర్ గేట్ ద్వారా 9649 క్యూసెక్కులు అవుట్ ఫ్లో కొనసాగుతుందన్నారు.