NLG: 102 అమ్మ ఒడి వాహన సేవలను గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కనగల్ పీహెచ్సీ డాక్టర్ రామకృష్ణ కోరారు. శుక్రవారం 102 సేవలపై పీహెచ్సీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలను బాలింతలను ఆసుపత్రికి తీసుకురావడం తిరిగి వారిని ఇంటికి చేర్చటంలో 102 సిబ్బంది సహకరిస్తారని వివరించారు.