MNCL: జన్నారం మండలంలోని రైతులు పేర్లు నమోదు చేయించుకుంటేనే ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుందని పోన్కల్ క్లస్టర్ ఏఈవో త్రి సంధ్య అన్నారు. సోమవారం జన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతుల పేర్లను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేశారు. ధాన్యాన్ని అమ్ముకునేందుకు కూడా పేర్లను నమోదు చేయించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, తదితరులు పాల్గొన్నారు.