SRPT: సంక్రాంతి సెలవులతో ప్రజలు, విద్యార్థులు ఇంళ్లకే పరిమితం కావడంతో కోదాడ బస్టాండ్ ప్రయాణికులు లేక బోసిపోయింది. మూడు రోజుల క్రితం వరకు రద్దీగా ఉన్న బస్టాండ్ ప్రాంగణం, ప్రస్తుతం జనసంచారం లేక వెలవెలబోతుంది. పండుగకు వెళ్లేవారు ముందే చేరడంతో బస్టాండ్లో రద్దీ తగ్గిందని, మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.