NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు అంగడి బజారు నుంచి జిరాయత్ నగర్ వరకు బీటీ రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నాయకులు తహసీన్ అహ్మద్, జిమ్మీ రవి ఈ పనులను ప్రారంభించారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు.