NRML: జిల్లా, రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పాటల పోటీలకు ఎంపికైన నిర్మల్ జిల్లాకు చెందిన గాయకులను కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందించారు. ఢిల్లీలో జరగనున్న జాతీయ పోటీల్లో సత్తా చాటి జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.