ADB: ఆర్ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో డా.నరేందర్ హెచ్చరించారు. ఆయన మండలంలోని ఆర్ఎంపీ కేంద్రాలను, సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి డా.శ్రీధర్తో కలిసి తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు.