KMR: ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఎస్పీ రాజేష్ చంద్ర భోగిమంటలను కాచి పతంగులను కుటుంబ సభ్యులతో కలిసి ఎగురవేస్తూ ఆనంద ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సాంప్రదాయాలను గౌరవిస్తూ భద్రత నియమాలను పాటించాలన్నారు. ప్రతి కుటుంబం సురక్షితంగా ఆనందంగా ఉండాలన్నదే పోలీస్ శాఖ సంకల్పమని తెలిపారు. జిల్లా ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.