BHPL: జిల్లా మండలంలో దీక్ష కుంట గ్రామంలో ఆదివారం 14 ఏళ్ల బాలుడు ఓదెలు బన్నీ ఈతకు వెళ్లి మృతి చెందాడు. రైతు పొలంలో వదిలేసిన నీటి గుంటలో ఈతకు వెళ్లిన ముగ్గురు పిల్లల్లో బన్నీ లోతుగా ఉన్న నీటిలో మునిగిపోయాడు. మూడు నెలల క్రితం ఆత్మకూరు నుంచి వలస వచ్చి కూలీ పని చేసుకుంటున్న కుటుంబానికి చెందిన బన్నీ మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.