BHPL: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదిత్య యువ మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజాంపల్లి గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్న పిల్లలకు మ్యూజికల్ చైర్ గేమ్ నిర్వహించారు. ముగ్గుల పోటీలకు ముఖ్యఅతిథులుగా సర్పంచ్ సునీత-రవీందర్, 5వ వార్డు మెంబర్ రాజేందర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.