గద్వాల: ధరూరు మండలం ఉప్పేరు గ్రామంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. 10 గంటలు కావస్తున్న వార్డెన్ సుధీర్ గౌడ్ రాకపోవడంతో విద్యార్థులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే తమ వసతి గృహాన్ని సందర్శించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.