NGKL: నంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని అచ్చంపేట సీఐ రవీందర్ వాహనాల దారులను సోమవారం హెచ్చరించారు. అచ్చంపేట సర్కిల్ పరిధిలో నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలు, ఫోర్ విల్లర్, ట్రాక్టర్లు అధికంగా కనిపిస్తున్నాయి. వెంటనే వాహన దారులు నంబర్ ప్లేట్లను బిగించుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.