KMR: కాచాపూర్‌లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ జ్యోతి తెలిపారు. బుధవారం గ్రామంలోని నాలుగో వార్డులో కొత్తగా బోరు మోటార్‌ను బిగించారు. గ్రామంలో ఎక్కడ నీటి సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దశరథం, వార్డు సభ్యులు, కాలనీవాసులు పాల్గొని నీటి సరఫరా మెరుగుదలపై హర్షం వ్యక్తం చేశారు.