న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (8) పరుగుల వద్ద ఔటై మరోసారి నిరాశపరిచాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 81/1. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్ (46*), గిల్ (22*) ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 278 పరుగులు కావాల్సి ఉంది.