»What Is The Target Of Afghan India That Has Been Attacked World Cup 2023
IND vs AFG: దంచికొట్టిన ఆఫ్గాన్..ఇండియా టార్గెట్ ఎంతంటే?
వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత్ రెండో మ్యాచ్ ఆడుతోంది. ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో టీమ్ఇండియా (IND vs AFG) తలపడుతోంది. టాస్ నెగ్గిన ఆఫ్గానిస్థాన్ కెప్టెన్ షాహిద్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ బౌలర్లు వేసిన బంతులకు భారీ స్కోర్ చేశారు.
What is the target of Afghan India that has been attacked? World Cup 2023
IND vs AFG: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత్ రెండో మ్యాచ్ ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో (IND vs AFG) తలపడుతోంది. టాస్ గెలిచిన ఆఫ్గానిస్థాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని రంగలోకి దిగింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఢిల్లీ మైదానంలో ఆప్గాన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. దీంతో భారత టార్గెట్ 273గా మారింది. అహ్మాతుల్లా షాహిది 88 బంతుల్లో 80 పరుగులు చేసి కులదీప్ వేసిన బంతికి ఔటయ్యి పెవిలియన్‌కు వెళ్లాడు. మిడిల్ ఆర్డర్ అజ్మతుల్లా 69 బంతుల్లో 62 పరుగులు చేశాడు. వీరిద్దరు అఫ్గాన్ తరుపున కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఆటలో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్ర అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొత్తం నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే హర్ధిక్ పాండ్య 2 వికెట్లు తీయగా కులదీప్ యాదవ్, శార్ధుల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.