IPL-2025లో SRH ఐదుగురు ప్లేయర్లను భారీ ధరకు రిటైన్ చేసుకోవడంతో ఆ జట్టుకు కొత్త చిక్కులు ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. ఐదుగురికే రూ.75 కోట్లు ఖర్చు చేయడంతో ఇక ఆ జట్టు దగ్గర రూ.45 కోట్లు, ఒక RTM మాత్రమే మిగిలింది. దీంతో మిగిలిన ఆటగాళ్లలో 15 మంది భారత, 5 విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంత తక్కువ పర్స్ వాల్యూతో కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయడం ఆ ఫ్రాంచైజీకి సవాల్‌గా మారనుందని క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు.