»Rohit Sharma Said That India Needs Players Like Rinku Singh
IND vs AFG: రింకు సింగ్ ఆటపై స్పందించిన రోహిత్
ఉత్కంఠపోరులో భారత్ నెగ్గింది. గెలుపోటములతో పెద్దగా ఆసక్తిలేని మ్యాచ్ రసవత్తరంగా ముగిసింది. ఏకంగా రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. ఈ పోరులో రోహిత్ శర్మతో భాగస్వామ్యంగా చెలరేగిన రింకు సింగ్ ఆటపై రోహిత్ ప్రశంసలు కురిపించారు. కష్టసమయంలో భారత్‌కు రింకు లాంటి ఆటగాడు అవసరం అని కితాబిచ్చాడు.
Rohit Sharma said that India needs players like Rinku Singh.
IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్‌తో 3-0 తేడాతో టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఉత్కంఠపోరులో రెండు టీమ్‌లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. భారత్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma), రింకు సింగ్(Rinku Singh) కీలకంగా ఆడారు. 69 బంతుల్లో 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు రోహిత్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న రోహిత్ యువ క్రికెటర్ రింకు సింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. రింకు లాంటి ఆటగాడు భారత్‌కు ఎంతో అవసరం అన్నాడు. ఈ సిరీస్‌లో రింకు సింగ్ మూడు మ్యాచ్‌లలో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడని పేర్కొన్నాడు.
రింకు సింగ్ టీమ్ ఇండియాలోకి అడుగు పెట్టిన అనతికాలంలోనే స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. కేవలం 15 మ్యాచుల్లో 11 ఇన్నింగ్స్‌లు ఆడి 356 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక అతన్ని టీ20 ప్రపంచకప్‌లో ఆడించాలని సర్వత్రా క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలకు ప్రధాన్యత సంతరించుకుంది. ఈ టోర్నీలో రోహిత్ కూడా చక్కటి ప్రదర్శన కనబరిచినట్లు చెప్పారు. ఇక రింకు సింగ్‌తో కలిసి 190 పరుగులు జోడించడం ఎప్పటికీ ప్రత్యేకమే అని. షాట్ల గురించి చర్చించుకుంటూ మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లామన్నారు. తీవ్ర ఒత్తిడిలో తాము నియంత్రణ కోల్పోలేదు అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన తర్వాత రింకు (Rinku SIngh) ఆటతీరు బాగుందన్నారు. జట్టుకు అతడి నుంచి ఏమి అవసరమో దానికి తగ్గట్టుగానే ఆడతాడు. భారత్‌కు కీలక సమయంలో ఇలాంటి ఆటగాళ్లు చాలా అవసరం అని రోహిత్ వ్యాఖ్యానించాడు.