క్రికెట్ చరిత్రలో ఊహించని చెత్త రికార్డ్ నమోదయింది. అబుదాబి టీ10లో భాగంగా ఢిల్లీ బుల్స్, బంగ్లా టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లా తరపున ఆడిన శ్రీలంక మాజీ కెప్టెన్ దసున్ షనక కేవలం 3 బంతులకే 30 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తం ఈ లంక ఆల్ రౌండర్ నాలుగు నో బాల్స్ వేశాడు. దీనికి తోడు ప్రత్యర్థి బ్యాటర్ నిఖిల్ చౌదరి 5 ఫోర్లు.. ఒక సిక్సర్ బాదాడు. దీంతో నాలుగో బంతి పడకుండానే 30 పరుగులు వచ్చి చేరాయి.