దేశవాళీ ఫస్ట్-క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ షెడ్యూల్ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇందులో నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్ జట్లు పాల్గొనబోతున్నాయి. టీమిండియా స్టార్ క్రికెటర్లు కూడా దులీప్ ట్రోఫీలో భాగం కానునన్నారు.