AP: అమరావతిలోని మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెట్టడం హర్షణీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెట్టిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల్లో స్ఫూర్తి నింపేలా జాతీయ జెండాను పింగళి రూపొందించారని కొనియాడారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీకి భారత త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.