TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్కు ఛైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు, మెంబర్గా ఐఎఫ్ఎష్ అధికారి సైదులును నియమించారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని వెంకటేశ్వర రావు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి చర్చలు జరిపినట్లు సమాచారం.