మహిళల ఛాతిని తీరైన ఆకృతిలో కనిపించేల చేయడంలో బ్రా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే వీటిని ధరించే విషయంలో కొందరికి రకరకాల సందేహాలు ఉంటాయి. బ్రా ధరించకపోతే వక్షోజాలు సాగుతాయనుకోవడంలో నిజం లేదు. సరైన బ్రా వేసుకుంటే నడుం నొప్పిని నివారిస్తుందనుకోవడం కూడా పొరపాటేనట. అన్ని వేళల దీన్ని ధరించడం వల్ల ఛాతి మెరుగు పడుతుందనుకోవడం కూడా తప్పేనని నిపుణులు చెబుతున్నారు. రోజంతా బ్రా వేసుకుంటే అలర్జీ సమస్యలు తలెత్తుతాయని వెల్లడిస్తున్నారు.