ప్రముఖ హిందూ సాధువు, ఇస్కాన్ గురువు చిన్మయ కృష్ణపై బంగ్లాదేశ్లో దేశద్రోహం కేసు నమోదైంది. ఆయనతోపాటు 19 మంది మైనార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు. రాజధాని ఢాకాతోపాటు అనేక చోట్ల మైనార్టీలు నిరసనలు చేశారు. మహ్మద్ యూనిస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయాక బంగ్లాదేశ్లో హిందువులు, మైనార్టీలపై వేల సార్లు దాడులు జరిగాయన్నారు.