AP: ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద వస్తోంది. 2,28,328 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు 70 గేట్లు 5 అడుగులు మేర ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కృష్ణా తూర్పు డెల్డా కాలువకు 5,309 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టా కాలువకు 2,519 క్యూసెక్కుల నీటిని వదులు తున్నారు. కాలువలకు మొత్తంగా 7,828 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.