AP: పోలవరం త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామన్నారు. ఉచిత ఇసుక విధానంలో అవినీతిని సహించేది లేదని హెచ్చరించారు. మరోవైపు మహిళలపై జరిగే అరాచకాలను సహించబోమన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై.. యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీపావళి తర్వాత అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు చేస్తామన్నారు.