ఇప్పుడు ఉన్న సమాజంలో కొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు లైంగిక విద్య గురించి చెప్పకపోవడమే అందుకు కారణమని లైంగిక వైద్యులు చెబుతున్నారు. పిల్లలకు నాలుగేళ్ల వయసులోనే లైంగిక విద్య పరిచయం చేయాలని అంటున్నారు. ముఖ్యంగా తెలియని వ్యక్తులు ప్రైవేటు పార్టులపై చేసే స్పర్శలో చెడు గురించి ఆడ పిల్లలకు అర్థం అయ్యే విధంగా అవగాహన కల్పించాలంటున్నారు.