TG: పత్తి కొనుగోళ్లపై మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’లో స్పందించారు. రాష్ట్రంలో తెల్ల బంగారం తెల్లబోతోందని విమర్శించారు. పండించిన పంటకు బోనస్ దేవుడెరుగు.. మద్దతు ధరకే దిక్కులేదని మండిపడ్డారు. దళారుల చేతిలో పత్తి రైతులు చిత్తవుతున్నారని ధ్వజమెత్తారు. రైతు ఆగమవుతుంటే ప్రభుత్వం పత్తా లేదని దుయ్యబట్టారు. రైతు డిక్లరేషన్ బోగస్.. కర్షక ద్రోహి కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు.