ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీస్పియర్స్(42) నాలుగో పెళ్లి చేసుకుంది. అయితే ఈసారి తనను తానే పెళ్లి చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన పెళ్లిల్లో ఇదే గొప్పది అని చెప్పింది. కాగా, బ్రిట్నీస్పియర్స్ మొదటగా స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ను 2004లో పెళ్లాడింది. తర్వాత అదే ఏడాది డ్యాన్సర్ కెవిన్ ఫెడెర్ లైన్‌ను పెళ్లి చేసుకుంది. 2022లో నటుడు సామ్ అస్గారిను పెళ్లి చేసుకుంది. అందరితో విడిపోయాక చివరగా తననే పెళ్లి చేసుకుంది.