AP: ఆర్థిక సమస్యలు ఉన్నా పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నెలకు రూ. 2729 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం మాదేనని వెల్లడించారు. ప్రభుత్వం వద్ద డబ్బులేదు కానీ ప్రజలకు అండగా ఉండాలనే మనసుందన్నారు. 3నెలలకు ఒకే సారి కూడా పెన్షన్ తీసుకోవచ్చన్నారు. ఇంటి వద్దనే గౌరవంగా అందిచాలని ఆదేశించానని, పెన్షన్ ఎవరు ఇవ్వకుండా ఆపినా నిలదీయండని సీఎం తెలిపారు.