TG: హైదరాబాద్‌లో చెరువుల పూర్వ వైభవానికి హైడ్రా ఫోకస్ పెట్టింది. గ్రేటర్ పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా 4 చెరువులు ఎంపిక చేసుకుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో హైడ్రా అధికారులు మార్కింగ్ పూర్తి చేశారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్‌తో పాటు సుందరీకరణకు చర్యలు చేపట్టింది. బాచుపల్లి ఎర్రగుంట చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, కూకట్ పల్లి నల్లచెరువు, రాజేంద్రనగర్ అప్పచెరువులను సుందరీకరించనుంది.