కెనడాలోని బ్రాంఫ్టన్ నగరంలో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ కెనడాలోని హిందువులు బ్రాంఫ్టన్లో భారీ నిరసన తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 1000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో హిందువులపై హింస పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.